Aggiornamento sulla petizioneNo Religion No Caste .. One More Option Please..
Actor Kamal Haasan Rejected Mentioning of Caste and Religion to His Daughters!

RAMAKRISHNA RAO D.V.Hyderabad, TG, India

1 lug 2018
కుమార్తెలను బడిలో చేర్చేటప్పుడు కులమతాల వెల్లడికి నిరాకరించా
కమల్‌హాసన్ వెల్లడి
చెన్నై, న్యూస్‌టుడే: తన కుమార్తెలను పాఠశాలలో చేర్చే సమయంలో దరఖాస్తులో కులమతాలను వెల్లడించడానికి నిరాకరించానని ఎంఎన్‌ఎం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తెలిపారు. ‘ఆస్క్ కమల్‌హాసన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. నాన్సి అనే ఓ నెటిజన్ కులానికి సంబంధించి ప్రశ్నిస్తూ శనివారం ఓ ట్వీట్ చేశారు. దీనిపై కమల్‌హాసన్ స్పందిస్తూ.. తన ఇద్దరు కుమార్తెలను పాఠశాలలో చేర్చేటప్పుడు దరఖాస్తులో కులమతాలను వెల్లడించలేదన్నారు. ఇది అలాగే తర్వాతి తరాలకు చేరుతుందని తెలిపారు. అదే కులమతాలను నిర్మూలించడానికి ఏకైక మార్గమని, దీనిని ప్రతి ఒక్కరూ చేయాలని సూచించారు.
Sostieni ora
Firma questa petizione
Copia il link
WhatsApp
Facebook
X
E-mail