Message aux signatairesMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP
వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చుతాం: ఈటల

Venkateshwarlu BoyaHyderabad, Inde

16 oct. 2016
వాల్మీకి బోయలను షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) జాబితాలో చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ లోని రవీంద్రభారతీలో ఆదివారం వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటల రిజర్వేషన్ల విధానంపై మాట్లాడారు. వనపర్తి బహిరంగ సభలో కేసీఆర్ బోయలకిచ్చిన మాటకు కట్టుబడే చెల్లప్ప కమిషన్ వేశారని తెలిపారాయన. కమిషన్ నివేదిక పరిశీలించి బోయ కులాన్ని రాజ్యాంగ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్టీలో చేర్చడానికి పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పేద ప్రజల బతుకులను అర్థం చేసుకొన్న ప్రభుత్వం తమదన్నారు మంత్రి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల ఆలోచలేని విధానాల వల్లే బోయలు అత్యంత వెనకబడి ఉన్నారని తెలిపారు రాజేందర్. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు ఎస్ నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. వాల్మికి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొంతమంది కవులను సన్మానించారు.
Soutenir maintenant
Signez cette pétition
Copier le lien
Facebook
WhatsApp
X
E-mail