Petition updateMission Valmiki: Reinstate Boyas Scheduled Tribes Status in Telangana and AP"తెలంగాణ వాల్మీకి బోయ జేఏసీ జెండా ఎజెండా ఖరారు!"

Venkateshwarlu BoyaHyderabad, India
10 Sept 2015
( Valmiki/Boyas Scheduled Tribal demand on JAC’s shoulder now!)
తెలంగాణ వాల్మీకి జేఏసీ జెండా ఎజెండా ఖరారయిందని జేఏసీ రాష్ట్ర కన్వినర్ శ్రీ ఎం వేణు గోపాల్ ప్రకటించారు. ప్రొఫెసర్ సాంబయ్య అధ్యక్షతన ,డిప్యుటి తాసిల్దర్ రిటైర్డ్ కుర్మన్న, గెజిటెడ్ అఫ్ఫీసర్ పెంటయ్య, కో కన్వినర్ వెంకట నారాయణ బీసీ సధికారత భవన్లో ఇవాళ మేధావులు,జిల్లల కన్వీనర్లు,విద్యార్థులు సమావేశమై జేఏసీ చెపట్టబోయే కార్యచరణను ఎలా ముందుకు తీసుకెళ్లాలని సుధీర్ఘంగ ఆలోచన చేసి, అందరి సమక్షములో చర్చించి సభ్యులు, కన్వీనర్లు, మేధావులు, టీచర్లు,విద్యార్థులు చెప్పిన సూచనలు,ప్రతిపాదనలు,సలహాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చామని జేఏసీ కన్వినర్ అన్నారు.
జేఏసీ ముందు ముఖ్యంగా 3 ప్రతిపాదనలు ఉన్నాయని అందులో..
1. ఎస్టీ సాధన
2. కేసీఆర్ సమక్షములో వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించుకొనేలా ముఖ్యమంత్రిని కలసి ఒప్పించడము
3. వివిధరాష్ట్రాలలో బోయలు ఎస్టీలుగా పరిగనించడానికి ప్రాతిపదిక ఏమిటి నివేదికలు తెప్పించుకొని ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలి.
అలాగే ఒక అధ్యయన కమిటి సమక్షములో
డాక్యుమెంటరీ,
పీపీటి,
సెకండరీ సొర్సెస్ ను చెల్లప్ప కమిటీకి అంధించడము
ఇంకా ఇవే కాకుండా జిల్లా, మండలాల్లో జేఎసీకి స్వచ్ఛందంగా కులము కోసమే పని చేసే వాళ్లతో కమిటీలు వేయడము, జేఎసీ అవసరాలకు జవాబుదారితో కూడిన నిధులను సమకూర్చుకోవడము, విశాల దృక్పదంతో వచ్చె వాళ్లను కలుపుకొని ముందుకు పోవాలనే తీర్మానాన్ని అందరు సభ్యుల సమక్షములో ఆమోదించడము జరిగిందని కన్వినర్ ఎం వేణు గోపాల్ ప్రకటించారు.
త్వరలోనే పత్రికా ముఖంగా తెలియజెస్తామని జేఎసీ నాయకులు అన్నరు. ఈ కార్యక్రమములో బోయ కళాకారుడు పాలమూరు ముద్దు బిడ్డ శివలింగం తన పాటతో జేఏసీ సభ్యులలో ఉత్తేజాన్ని నింపాడు.
-Venkateshwarlu Boya
(Telangana Journalist)
9391204009
Support now
Sign this petition
Copy link
WhatsApp
Facebook
Nextdoor
Email
X