Petition Closed

మా ఊరి బ‌డిని కాపాడండి

This petition had 106 supporters


గౌర‌వ నీయులైన హై కోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి గారికి....

 ప్రభుత్వ పాఠ‌శాల‌లు కుల మతాలకు అతీతంగా పేద, ధనిక తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కొన్ని సంవత్సరాల నుండి విద్యను అందిస్తూ ఎంతో మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాయి. కానీ ఇప్పుడు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మృత్యు ముంగిట నిల‌బ‌డ్డాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వేలాది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల మూసివేత‌కు దారితీస్తోంది. రేష‌న‌లైజేష‌న్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను విద్య‌కు దూరం చేసే ప్ర‌క్రియ‌కు తెర‌తీసింది రాష్ట్ర ప్ర‌భుత్వం. 20 మంది కంటే త‌క్కువ మంది విద్యార్థులు గ‌ల ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌ల‌ను మూసివేయాలంటూ జూన్‌ నెల‌లో విద్యాశాఖ జిల్లా విద్యాధికారుల‌ను ఆదేశించింది. ఈ ఉత్త‌ర్వుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా 4637 ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌నున్నాయి. గ‌త కొన్నేళ్లుగా ప్ర‌భుత్వాలు ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థ‌ల‌తో కుమ్మ‌కై  ప్రభుత్వ బడులల్లో వసతులను తగ్గిస్తూ, నాణ్యతలేని విద్యనందిస్తున్నాయి.


 ఉపాధ్యాయులను నియమించకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల చేతనే ప్రభుత్వ విద్యపై నమ్మకం కోల్పోయేలాగా చేశాయి. దీన్ని సాకుగా చూపి ఇప్పుడు విద్యార్థులు ప్రభుత్వ బడులల్లో చేరటం లేదని మన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే రేష‌న‌లైజేష‌న్ పేరుతో.. ప్ర‌భుత్వ బ‌డుల మూసివేత‌కు సిద్ధ‌మైంది. ఫ‌లితంగా రెక్కాడితే గానీ డొక్కాడని  కుటుంబాలు ల‌క్ష‌లు వెచ్చించి త‌మ పిల్ల‌ల్ని కార్పోరేట్ సూళ్ల‌లో చ‌దివించ‌లేక బ‌డిమాన్పిస్తున్న ప‌రిస్థితి క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది.

అంద‌రికీ స‌మాన విద్య అందించాల్సిన ప్ర‌భుత్వాలే కార్పోరేట్ విద్య‌ను ప్రోత్స‌హిస్తుండ‌డం విషాదం. ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్ని నిర్వీర్యం చేసే ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను ప్ర‌జ‌లు ముక్త క‌ఠంతో వ్య‌తిరేకిస్తున్నారు. త‌మ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య అందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల‌మాద్య‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టి విద్యార్థుల భ‌విష్య‌త్తుకు దోహ‌ద‌ప‌డానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు త‌మ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను మూసివేయ‌వ‌ద్దంటూ నెల రోజ‌లు ఆందోళ‌న చేస్తున్నారు. పోస్టు కార్డుల రూపంలో త‌మ డిమాండ్‌ల‌ను న్యాయ‌స్థానం దృష్టికి తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకొనేలా న్యాయ‌స్థానం జోక్యం  చేసుకోవాల‌ని తెలంగాణ విద్యార్థి వేదిక కోరుతోంది. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను విద్య‌ను అందించాల్సిన భాద్య‌త నుంచి ప్ర‌భుత్వం త‌ప్పించుకోవ‌డం స‌రైంద‌ని, రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కును హ‌రించ‌డం ప్ర‌జాస్వామ్య విరుద్ధ‌మ‌ని గుర్తుచేస్తూ ఈ విష‌యంలో న్యాయ‌స్థానం చొర‌వ‌ను ఆశిస్తున్నాం. ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో ఉపాద్యాయ నియ‌మ‌కాలు జ‌రిపి,  నాణ్య‌మైన విద్య‌ను అందించేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని గ్రామీణ నిరుపేద విద్యార్థుల ప‌క్షాన విజ్ఞ‌ప్తి చేస్తున్నాం.

 


మ‌హేష్‌,
రాష్ట్ర అధ్య‌క్షుడు,
తెలంగాణ విద్యార్థి వేదిక‌

 

 Today: Tvv is counting on you

Tvv Mahesh needs your help with “The Chief Justice High Court : ఊరి బ‌డిని కాపాడండి”. Join Tvv and 105 supporters today.