Petition Closed

Save Government Schools in AP and TS

This petition had 545 supporters


ప్రభుత్వం విద్య...వైద్య రంగాల నుంచి దాదాపుగా తప్పుకుంది.
మద్యం ఒక ఆదాయ వనరుగా మార్చేసుకుంది.
నాణ్యమైన విద్యకి...వైద్యానికి జనం అనవసర ఖర్చు ఎక్కువ చేయాల్సి వస్తుంది. విద్య...వైద్యం....పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే..అది నిజమైన సంక్షేమం రాజ్యం. కార్పోరేట్‌ విద్య, వైద్యం వ్యాపారాలలో ఉన్న వాళ్ళే...రాజకీయాలలో ఉన్నారు. మంత్రులైయారు......అదే మరి మన కామెడీ...!
......................
భారత రాజ్యాంగం సామ్యవాద విత్తనాలు వేసింది.
సమాజంలో పెట్టుబడిదారీ వృక్షాలు పెరుగుతున్నాయి.
..........
మాతృభాష అంటే....
మనం....మన మానవ సంబంధాలు...మన కలలూ...మన కన్నీళ్ళూ....మన వావి వరసలూ...మన పండగలూ....మనల్ని మన చుట్టూ ఉన్న ప్రకృతిలో భాగం చేసేది.
దానికి దూరంగా పిల్లల్ని మరో భాషలో చదివిస్తే...!
వాళ్ళు అన్నింటికీ దూరం అవుతారు.
వారికి వారే దూరం అవుతారు.....
......................................

ఆరవ తరగతికే ఐఐటి ఫౌండేషన్లు మనకి అవనరమా?
విదేశీ కంపెనీలకోసం పనిచేనే టెక్‌నోక్రాట్స్‌లని మాత్రయే మనం తయారు చేస్తున్నాం.
మన దేశంలో సృజనాత్మకతని చంపేస్తున్నాం.
కార్పోరేట్‌ విద్యలో కొట్టుకుపోయి ఇప్పటికే ఒక తరం పోయింది.
శ వ్యాప్తంగా విద్యలో నాణ్యత ఒకే విధంగా ఉండాలి.
రద్దు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు చేయండి.
లేదా....ప్రయివేటు పాఠశాలలు రద్దు చేయాలి.
ఈ రెండూ ఉండడం వల్ల సిలబన్‌లో తేడాలు వస్తునాయి.
నాణ్యతలో తేడాలు ఉంటున్నాయి.
ప్రయివేటు పాఠశాలలో విద్యార్ధులు మరమనుషుల్లా తయారవుతునారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తూ....
ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌లో ప్రతి ఒక్కరు పాల్గోవాలి.

 దేశ వ్యాప్తంగా విద్యలో నాణ్యత ఒకే విధంగా ఉండాలి.
రద్దు చేస్తే ప్రభుత్వ పాఠశాలలు చేయండి.
లేదా....ప్రయివేటు పాఠశాలలు రద్దు చేయాలి.
ఈ రెండూ ఉండడం వల్ల సిలబన్‌లో తేడాలు వస్తునాయి.
నాణ్యతలో తేడాలు ఉంటున్నాయి.
ప్రయివేటు పాఠశాలలో విద్యార్ధులు మరమనుషుల్లా తయారవుతునారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తూ....
ఈ ఆన్‌లైన్‌ పిటిషన్‌లో ప్రతి ఒక్కరు పాల్గోవాలి.

ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు అని ప్రభుత్వ ప్రకటించాలి.

.............................

ప్రయివేటు...కార్పొరేట్‌ సిలబస్‌...
పిల్లలు ఐఏయస్‌లు, ఐపియస్‌లు కావడానికి...
పనికిరాదు.

________________________________________________

ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి !
కానీ ప్రభుత్వ పాఠశాలలంటే చిన్నచూపు
ఇది సంపన్నుల నుంచి పేదోడిదాకా పాకింది.
అమ్మా.. నాన్నకు బదులు మమ్మీ..డాడీ
అని పిలిపించుకోవాలనే దుగ్ద మరింత పెరిగింది.
ఇంగ్లిషుపై మోజు కాకపోవచ్చు.
ఇంగ్ల్లిషు మీడియంలో చదవకుంటే వెనకబడిపోతారనే భయం.
ఉద్యోగాలు రావేమోననే ఆందోళన. పిల్లల భవిష్యత్తుపై బెంగ.
కొందరు సంపన్నులకు, ఎగువ మధ్య తరగతి జనానికి
ఇంగ్లిష్‌ మీడియంలో చదివించడం ఓ సోషల్‌ స్టేటస్‌.
ఈ బలహీనతల్నే కార్పొరేట్‌ ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.
సారీ ! ప్రజల మూలిగలు పీల్చేస్తున్నాయి.
ఇక్కడ కొన్ని అంశాలు ఇస్తున్నాం. వీటిని పరిశీలించిన తర్వాత
మీ పిల్లల ఎదుగుదలకు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.
...........................
- ఏ విద్యార్థి అయినా నాలుగో వంతు మాత్రమే పాఠశాల నుంచి నేర్చుకుంటాడు.
మరో నాలుగో వంతు కుటుంబం నుంచి నేర్చుకుంటాడు. ఇంకో నాలుగోవంతు
చుట్టూ ఉండే పరిసరాలు, స్నేహితుల నుంచి విజ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు.
చివరి నాలుగో వంతు తన అనుభవాల నుంచి నేర్చుకోవాలి. ఇలా ఎదిగిన వాళ్లు
మాత్రమే పరిపూర్ణ మేథస్సుతో సమాజంలో విలువలతో కూడిన
మనిషిలా మనగలుగుతారు.
- ఇలాంటి విజ్ఞానం పొందాలంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యం.
పదో తరగతి వరకూ మాతృ భాషలోనే విద్యా బోధన జరగాలి.
అర్హత కలిగిన ఉపాధ్యాయులుంటారు. క్రీడలను ప్రోత్సహిస్తారు.
శరీర ధారుడ్యాన్ని పెంపొందిస్తారు. నైతిక విలువలను బోధిస్తారు.
భావ వ్యక్తీరణకు పెద్దపీట వేస్తారు. సృజనాత్మకతకు బీజం వేస్తారు.
పాఠాలు వినడానికి, వల్లెవేయడానికి ఇక్కడ చాలా తక్కువ సమయం కేటాయిస్తారు.
విన్నది నేర్చుకోవడానికి, స్వయంగా ఆచరణలో పెట్టడానికి ప్రాధాన్యమిస్తారు.
విద్యార్థుల సొంత ఆలోచనలకు పురుడు పోస్తారు.
- ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండొచ్చు.
మౌలిక సదుపాయాలు లేకపోవచ్చు. వాటిని సాకుగా చూపడం కాదు.
వీటి కోసం ప్రభుత్వాన్ని నిలేయాలి. పాఠశాలలను సజీవంగా
నిలబెట్టుకునేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలి.
పేరెంట్స్‌ కమిటీ క్రియాశీలకంగా పనిచేయాలి.
గొప్పగా ఎదిగిన వాళ్లంతా వీధి బడుల నుంచే వచ్చారన్న సంగతి తెలుసు కదా !
...........................
- ఇంగ్లిష్‌ మీడియంలో చదివే విద్యార్థులకు భావ వ్యక్తీకరణ లోపం ఉంటుందని
సైకాలజిస్టులు నిగ్గు తేల్చారు. పాఠశాలలో తప్ప కుటుంబంలో కానీ,
చుట్టూ పరిసరాల్లో కానీ ఇంగ్లిష్‌ మాట్లాడే వాళ్లుండరు. ఈలోపం విద్యార్థుల
ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సృజనాత్మక భావనలకు అసలు
తావే ఉండదు. ఒంటరితనానికి గురవుతారు.
- ప్రత్యేకించి కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్పూన్‌ ఫీడింగ్‌
అలవడుతుంది. ముఖ్యమైన సబ్జెక్టులను వల్లెవేయించడం ద్వారా మార్కులు,
గ్రేడ్లకే ప్రాధాన్యమిస్తారు. తల్లిదండ్రులను కూడా ఈ రొంపిలోకి లాగుతారు.
క్రీడలకు ప్రాధాన్యం లేదు. ఎక్కువ మంది పిల్లలు ఒబేసిటీ, విటమిన్‌ ఏ లోపంతో
బాధపడతారు. బాల్యంలోనే కోడిగుడ్డు అద్దాలు ముక్కుమీదకు వచ్చేస్తాయి.
- అతి త్వరగా ఆత్మన్యూనతకు గురవుతుంటారు.
ఒంటరితనానికి గురై ఆత్మహత్యలకు దారితీసే అవకాశాలున్నాయి.
వల్లెవేయడంలో ప్రతిభ చూపే విద్యార్థుల ఎదుట మిగతా వాళ్లను ఎగతాళి చేస్తారు.
స్వతంత్ర ఆలోచనలున్న పిల్లలను పనికిరాని వాళ్లుగా ముద్ర వేస్తారు.
వాళ్ల ఆలోచనలు, భావనలకు విలువ ఇవ్వరు.
- ఎల్‌కెజి నుంచే ఐఐటి కోచింగ్‌ అంటూ తల్లిదండ్రుల అభద్రతా భావాన్ని
సొమ్ము చేసుకుంటారు. పసివాళ్లను రోబోలుగా మార్చేస్తారు.
కెరీర్‌ తప్ప జీవితంలో మరింకేమీ లేదనే భావన నెలకొల్పుతారు.
డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చేస్తారు. రోజుకు 18 గంటలు హాస్టల్‌
లేదా పాఠశాలలో నిర్బంధిస్తారు. మార్కులు, గ్రేడ్లు తప్ప జీవిత పరమార్థం
మరేమీ లేదనేట్లు చేస్తారు.
- అందుకే నేడు ఎంతోమంది ఐటి నిపుణులు
కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలో తెలియని దుస్థితికి చేరారు.
ఉన్మాదులుగా మారుతున్నారు. పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి.
ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. సంసారాలు గుల్లవుతున్నాయి.
................................................
ఇదంతా ప్రభుత్వాలను నడిపిస్తున్నవారి దుష్ట పన్నాగం.
ప్రజలను నిలువుదోపిడీ చేసినా ప్రశ్నించే యువతరం ఉండకూడదు.
జనం చెల్లిస్తున్న పన్నులతో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది
ఆలోచించే యువత తయారవకూడదు. రాజకీయాల్లో తామేం చేసినా..
చచ్చు సన్నాసులను పదవుల్లో నియమించినా ప్రశ్నించేవాళ్లు ఉండకూడదు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్లకు మాత్రమే
రాజకీయ అవగాహన ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల అసలు ప్రభుత్వ విద్యా సంస్థలే ఉండకూడదనేది వారి అభీష్టం.
కుక్కను చంపాలంటే ముందుగా పిచ్చి కుక్క ముద్ర వేస్తే చాలు!
తలా ఒకరాయి వేసి దాన్ని జనమే చంపేస్తారు!
నేడు ప్రభుత్వం అదే చేస్తోంది. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను
సరిచెయ్యడానికి అవకాశం ఉన్నా ఆ పని చేయదు. పైగా వాటిని
భూతద్దంలో చూపించి ప్రభుత్వ పాఠశాలలను మూసెయ్యడానికి సిద్ధమైంది.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలని చదివిద్దా అంటే... ఆ ఆలోచనని మహిళలు ఉరేసి ఉప్పుపాతరేసే వ్యవస్ధలో పరిస్ధితి ఉంది.

ప్రభుత్వ ఉద్యోగులు వారి పిల్లలను ప్రభుత్వపాఠశాలలోనే చదివించాలనే నిబంధన రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలి.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ ఉదోగాలు అని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాలి.
పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించే కుటుంబాలకే సంక్షేమ పధకాలు అని ప్రభుత్వం ప్రకటించాలి.

ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు అని ప్రభుత్వ ప్రకటించాలి.
జరుగుతున్న కుట్రకి విరుగుడు అదే!
ఇది ప్రజలు అర్ధంచేసుకోవాలి.

 

Please sign the petition and promote it among your friends.Today: velavartipati is counting on you

velavartipati vachaspati needs your help with “Strengthen the Government Schools Read the Petition and sign it to save Government Schools in AP and TS”. Join velavartipati and 544 supporters today.