నిర్భయ ఉదంతంలో సుప్రీం కోర్ట్ తీర్పు వెంటనే అమలు పరచాలి
నిర్భయ ఉదంతంలో సుప్రీం కోర్ట్ తీర్పు వెంటనే అమలు పరచాలి

నేను... మీ అందరి చేత భారత మాత బిడ్డ గా పిలవబడుతున్న నిర్భయ కి మాతృమూర్తిని. ఏడు ఏళ్ళ కృతం జరిగిన
దారుణమైన ఘటనలో బాధితురాలి తల్లిని. ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తున్న అమాయకురాలిని. ఇంతలో మరెన్నో దారుణాలు. హైదరాబాద్ సంఘటన. నాకు తెలుసు ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో!
మా ఇద్దరి చిట్టితల్లులు యుక్త వయసులో ఉన్నవారే! ఇద్దరి చిట్టితల్లులు మెడికో లే. ఇద్దరినీ అతిదారుణంగా.......
ఇపుడు మళ్ళీ వింటున్నా బాధితులకు సత్వర న్యాయం చేస్తాం అని, నేను ఎన్నో యేళ్ల నుండి వింటున్న మాటనే అది. ఈ డిసెంబర్ 16 కి 7 సంవత్సరాలు పూర్తవుతాయి.
కానీ మాకు జరిగిన న్యాయం ఏది?
ఇంకేన్నాళ్ళని ఎదురుచూస్తాం?? నాతో పాటు ఈ దేశం కూడా ఎదురుచూస్తానే ఉంది న్యాయం కోసం!ఎంతో మంది నాకు సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు నేటికి కూడా!
అందుకే ఒకడుగు ముందుకేసా. మన గౌరవనీయులైన ప్రధాని కి మన ఈ విన్నపం చేరేదానికి నా ఈ పిటీషన్ కు మద్దతుగా రండి. ఆయన చొరవ తీసుకొని మార్గనిర్దేశకత్వం చేయాలన్న ఈ విన్నపానికి మద్దతు పలకండి.
గడిచే ప్రతీరోజు 132 ఆడ బిడ్దలు మానభంగానికి గురవుతున్నారు. అంతెందుకు ఈ సంవత్సర ప్రధమార్ధంలోనే 24 వేల మంది ఈ అకృత్యానికి గురికాబడ్డారు అని కేసులు నమోదయ్యాయి.
ఇది కాదు కదా మన భారతం. ఇలాంటి భద్రతలేని భారతదేశం కాదు కదా మనది. మన దేశం మీద ఉన్న ఈ నిందను చెరిపి వెయ్యాలని నా కోరిక. ఆలస్యం చేసేకొద్ది ఇంకా ఇలాంటి భయంకరమైన అకృత్యాలను మరిన్నిటిని చూడాల్సి ఉంటది.
అందుకే రండి చేయి చేయి కలుపుదాం. ఈ ప్రభుత్వానికి మన భాద విన్నవించుకుందాం. మన ఆవేశాన్ని తెలియచేద్దాం. సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించుకుందాం!
జై హింద్!