Build Quality Roads & Drainage or Refund Road Tax & Muncipal Tax GHMC

0 have signed. Let’s get to 100!


గౌరవనీయ రాష్ట్రమంత్రివర్యులు రామారావు మరియు నగర మేయర్ బొంతు రామ్మోహన్ గారికీ మా నమస్కారాలు.
అయ్యా, 
మేము అనగా హైద్రాబాదు నివాసులము సమిష్టిగా మీ దృష్టికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం.. గత కొన్ని రోజులుగా హైద్రాబాదు రోడ్లు మరి అద్వాన్నంగా తయారు అయినాయి.. చాల చోట్ల పెద్ద పెద్ద గుంతలు, కొన్నిచోట్ల ఏకంగా చిన్నపాటి కుంటలను తలపిస్తున్నాయి.. 15 నిమిషాలు వెళ్ళవలసిన దారిలో ఏకంగా మూడు గంటలు నరకం చూడాల్సి వస్తుంది... వీటికి కేవలం వర్షాలు కారణం కాదని , నాణ్యమైన రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి  తేలేకపోవడం వల్ల  ఈనాడు ఈ దుస్థితి ఎదురైందని నిర్మొహమాటంగా తెలియజేస్తున్నాము. ఒక నగరానికి ఉండాల్సిన కనీస సదుపాయాలు లేకుండా విశ్వనగరం చేయడం అసాధ్యమని మీకు తెలియంది కాదు. ఈ ఏటా భారీ వర్షాల వల్ల రోడ్లు పాడయ్యాయనుకుంటే , ఇంతకన్నా ఎక్కువ వరదలు, వర్షాలు ఈ నగరం ఎదుర్కొంది.. కానీ మరీ ఇంత దారుణంగా రోడ్లు దుర్భరంగా కాలేదు. రోడ్డు వేసిన రొండు వారాలు కూడా కాకముందే కంకర తేలి దుమ్ముకొట్టుకుపోతుంది..  దీని వల్ల రోజు అనేక మంది ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది..

రోజంతా ఆఫీసుల్లో పనిచేసి ఇంటికి వెళ్లి సమయానికి, బస్సుల్లో, ద్విచక్రవాహానాలపై గతుకుల రోడ్లలో గంటలు గంటలు నరకం అనుభవిస్తున్నాము.. ఈ రోడ్లు అద్వాన్నంగా తయారు అవ్వడానికి అడ్డదిడ్డంగా నిర్మిస్తున్న రోడ్లు, భవనాలు ఒకవైపైతే వరద కాలువలు నిర్మించక పోవడం మరొకటి. గత రొండు రోజుల్లో కొన్ని కాలనీలు ఏకంగా నీట మునిగాయి.. ఐటీ లో నగరానికే తలమాణికమైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లిహిల్స్, నానక్ రాం గూడ, తదితర ప్రాంతాల్లో బళ్ళు, మోటారు సైకిళ్ళు నీళ్ళల్లో తెలియాడుతున్నాయి.. ఉదాహరణకు.. దుర్గం చెరువు అలుగు క్రింద అనేక అక్రమ భవనాలు నిర్మించడం వల్ల వర్షపు నీరు ఏకంగా రాయదుర్గం రోడ్డును ముంచెత్తుతుంది.. ఆలాగే బయోడైవర్సిటీ వద్ద కూడాను... 

హైద్రాబాదును తెలంగాణ రాజధాని అని  గర్వ0గా  చేప్పుకోవడానికి ఉండేలా తీర్చిదిద్దుతారు అనుకుంటే అది నానాటికీ ఆడియసే అవుతుంది...  దయచేసి వెంటనే నాణ్యమైన రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని లేని పక్షంలో మేము చెల్లించిన రోడ్డు టాక్సీ మరియు మున్సిపల్ టాక్సీలు వాపసు ఇవ్వగలరు.

ఇట్లు,
హైద్రాబాద్ నగర వాసులు.. పి ఎన్ ఆర్

 



Today: Narendar is counting on you

Narendar Pnr needs your help with “KT RamaRao KTR & Mayor RamMohan: Build Quality Roads & Drainage or Refund Road Tax & Muncipal Tax GHMC”. Join Narendar and 31 supporters today.