Control on social media

0 have signed. Let’s get to 200!


తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పోలీస్ బాస్ ల కు విజ్ఞప్తి !

మిర్యాలగూడ సుపారీ హత్యా దృశ్యాన్ని టీవీ చానెల్స్ పదే పదే ప్రసారం చేస్తూ ఉంటే , నా మనసు కీడు శంకించింది . 17 వ తేదీ నాడే, దీని వల్ల మరిన్ని నేరాలు జరుగుతాయని పోస్ట్ పెట్టాను . సరిగ్గా రెండు రోజులకు హైదరాబాద్ లో అలాంటి ఘటనే రిపీట్ అయ్యింది . రెండవ ఘటన జరిగాక మీరు సంయమనం పాటించాలని టీవీ ఛానల్పై కు విజ్ఞప్తి చేసారు . లా అండ్ ఆర్డర్ మెయింటనెన్స్ తో సంబంధం లేని ఒక సాధారణ పౌరుడిగా నా కు వచ్చిన అనుమానం మీకు ఎందుకు రాలేదు సర్ ? ముందుగా మేల్కొని ఉంటే ఎర్రగడ్డ ఘటన జరిగి ఉండేది కాదు కదా ? ఈ విషయం లో adhoc పద్దతులేనా లేనా ? క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశం లేదా ? నేరపూరిత సన్నివేశాలను టీవీ ఛానల్పై లో ప్రసారం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్ట లేరా ? టీవీ చానెల్స్ అయినా ఎంతో కొంత భాద్యతగా ప్రవర్తిస్తున్నాయి . ఇక సోషల్ మీడియా లో అయితే పరిస్థితి దారుణం .

నేను కేవలం మిర్యాలగూడ ఘటన తరువాత జరిగిన ఘటనల గురించే చెప్పడం లేదు . గత కొన్ని ఏళ్లుగా రాను బరితెగిస్తున్న పోస్ట్ ల గురించి చెబుతున్నా! ఒక వర్గాన్ని అంటే ఒక మతాన్ని మరో మతం పై ఒక కులాన్ని లేదా కొన్ని కులాలను మరో కులం పై లేదా కొన్ని కులాలపై రెచ్చ గొడుతూ , అత్యంత జుగుప్స కరమైన రీతిలో పోస్ట్ లు పెడుతున్న వారు వున్నారు . ఇందులో పచ్చి బూతులు ఉంటాయి . పూర్తి స్థాయి లో ద్వేషాన్ని రెచ్చ గొట్టేలా ఉంటాయి . చంపడని, నరకండిని ఎలాంటి సంశయం లేకుండా చెబుతుంటారు . అప్పటిదాకా సంయమనం పాటించిన వారు కూడా అవతలి వర్గం వారి ఇలాంటి పోస్ట్ లను చూసి రెచ్చి పోతారు . దానికి స్పందనగా అలాంటి పోస్ట్ లనే పెడుతారు . దాన్ని చూసి అవతలి వారు మరింత గా రెచ్చి పోతారు . ఇలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటించండి అనే వారి మాటకు విలువ లేకుండా పోతుంది . అవతలి తీవ్రవాదం ఇవతల తీవ్రవాదాన్ని రెచ్చగొడుతుంది . ఇవతలి ది అవతలి దాన్ని మరింత రెచ్చి పొయ్యేలా చేస్తుంది .

మీకు లా అండ్ ఆర్డర్ గురించి నాకంటే వెయ్యి రెట్లు ఎక్కువ తెలుసు . నేను చెప్పాల్సిన అవసరం లేదు . అయినా భాద్యత కలిగిన పౌరుడిగా చెబుతున్నా ! ఇప్పటికిప్పుడు ఇలాంటి పోస్ట్ ల వల్ల వీధి యుద్ధాలు జరగక పోవచ్చు . కానీ టెన్సన్స్ బిల్డ్ అప్ అవుతున్నాయి . ముఖ్యంగా యూత్ మైండ్స్ pollute అవుతున్నాయి . చంపడం , బూతులు తిట్టడం , ప్రతీకారం తీర్చుకోవడం ఇవన్నీ నేడు పాఠశాల దశలోనే పిల్లలు నేర్చుకొనే పరిస్థితి వచ్చేసింది . ఇది ఇలాగె కొనసాగితే మీరు రిటైర్ అయ్యాక అయినా వీధి పోరాటాలు , గాంగ్వార్స్ మాములు అయిపోతాయి సర్ . అప్పుడు మన రాష్ట్రాలు కొలంబియా, మెక్సికో ల లాగా తయారు అవుతాయి . మన దేశం లో వున్నా వైవిద్యం వల్ల ఇది మరింత ప్రమాద కర స్థితికి దారి తీసిన ఆశ్చర్యం లేదు . సర్ దయ చేసి ఈ కింది చర్యలు చేపట్టండి .

1 . సైబర్ క్రైమ్స్ సెల్ ఉందని నాకు తెలుసు . కానీ వారివద్దకు కంప్లైంట్ వెళితేనే వారు చర్య చేపడుతున్నారు . ఆలా కాదండి. దాన్ని పటిష్టం చెయ్యండి . కనిస్సం నలుగురు IPS ఆఫీసర్స్ అందుకు తగ్గ సంఖ్య లో కింది స్థాయి అధికారులు ఆ వింగ్ లో ఉండాలి . ఈ వింగ్ సుమటో గ అంటే తనకు తానే విద్వేషాన్ని రెచ్చగొట్టే పోస్ట్ లను గుర్తించి చర్యలు చేపట్టాలి . ఏ సెక్షన్స్ కింద కేసు పెడుతారో మీరు చూస్కోండి సర్ . కనీసం ఒక నెల చెంచల్ గూడా ఆదిత్యం దొరకాలి . లేక పొతే చెప్పిన మాట వినరు ఈ సామజిక నేరగాళ్లు .

2 . ఇన్ని కోట్ల మంది ఫేస్బుక్ లో వాట్స్ అప్ లో పోస్ట్ చేసున్నప్పుడు మేము ఎంత మంది పై నిఘా పెట్టగలం అంటారా ? అయ్యో .. ఏంటి సర్ .. మనసు ఉంటే మార్గం ఉంటుంది . ఆ మధ్య కాలం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు పేస్ బుక్ ID తో చాల మంచి చర్యలు చేపట్టారు . సైబర్ CRIMES లో పని చేసే ప్రతి అధికారి కి ఒక ID ఉండేలా చూడండి. అంటే కనీసం రెండు వందల మంది నిఘా ! ఇదే సరి పోదు అని నాకు తెలుసు . రెచ్చ గొట్టే పోస్ట్ లు ఉంటే ఈ ID లకు ఇన్బాక్స్ లో మెసేజ్ లు పెట్టమని పబ్లిక్ ను అడగండి . మీ తరపున వాలంటరీ గా పని చెయ్యడానికి లక్ష మంది దొరుకుతారు . ఆ పోస్ట్ ల ను పరిశీలించి చర్య తీసుకోండి . రోజుకి పది మంది చెప్పున ఒక నెల రోజుల డ్రైవ్ చేపట్టండి . దెబ్బకు మూసుకొని అదే వారి అకౌంట్స్ క్లోజ్ చేసుకొని పోతారు .

3 . మరో విషయం సర్ . నేడు అన్నింటికీ ఆధార్ కార్డు కావాలి . కానీ ఫేస్బుక్ అకౌంట్ కు అక్కర లేదు. ఒకడు ఎన్ని ఫేక్ అకౌంట్ లు అయినా సృష్టించుకోవచ్చు . కేంద్ర ప్రభుత్వం ద్వారా సోషల్ మీడియా ID లకు ఆధార్ లింక్ అయ్యేలా చర్య లు చెప్పటండి .
4 . మరో ముఖ్యం అయిన విషయం . నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ . నీలి చిత్రాలు చూసి యూత్ .. యూత్ ఏమి కర్మ... కాటికి కాళ్ళు చాచుకొన్న ముసలాడు సైతం ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్నారు . నీలి చిత్రాలు డౌన్లొడ్ చేసుకోవడం నేరం కదా ? ఒక కాలేజీ లో, ఒక రైల్వే స్టేషన్ లో, మరో పబ్లిక్ ప్లేస్ లో సడన్ గా డ్రైవ్ చేసి స్మార్ట్ ఫోన్ లు తీసుకొని బ్రౌసింగ్ హిస్టరీ చూసి నీలి చిత్రాలు చూసిన వారి పై కేసు లు పెట్టండి .

5 . నేటి తరం పిల్లలకు తల్లితండ్రులు చిన్నప్పుడే స్మార్ట్ ఫోన్ లు ఇచ్చేస్తున్నారు . ఇది అనేక దుష్పరిణామాలకు దారితీస్తోంది . ఒక విద్యావేత్తగా నేను దీనిపై పోరాటం చేస్తున్నాను . నిజానికి ఇది మీ భాద్యత కదా సర్ . ఒక్క సరి ఆలోచించండి . నాలాంటి వారు ఎంతో మంది మీతో నడుస్తారు .