గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి:
ఎందుకంటే ...
• మనది వేద భూమి. వేద కాలం నుండే మనకి గోవు పూజనీయం.
• సింధు నాగరికత సమయంలో నందిని నాణాల మీద ముద్రించిన చరిత్ర వుంది.
• గోవు సమస్త దేవతా స్వరూపం
• గోవు మన వ్యవసాయానికి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకి ఆధారం
• గో ఆధారిత ఉత్పత్తులన్నీ ఆర్ధికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా మనకి అత్యంత ప్రాధాన్యత కలిగినవి
• ఆవు పాలు మాత్రమే శ్రేష్టం, ఆవు పాలు తల్లి పాలతో సమానం
• గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను తిరిగి నిలబెట్టగలిగే శక్తి ఒక్క గోవుకి మాత్రమే ఉంది
• ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ విసర్జించే ఏకైక ప్రాణి గోవు మాత్రమే
• మలమూత్రాలు కూడా ఔషధాలుగా పనికివచ్చే జీవీ కేవలం గోవు మాత్రమే
• ఒకప్పుడు సమాజంలో గోసంపదను మాత్రమే సంపదగా పరిగణించేవారు
• రసాయన పదార్ధాలతో, కాలుష్యంతో విషతుల్యం అయిపోయిన మన వ్యవసాయ రంగాన్ని, నేలని, నీటిని, మొత్తం ప్రకృతిని మళ్ళీ యధాతద స్థితికి తీసుకురాగలిగే శక్తి కేవలం ఒక్క గోవుకి మాత్రమే ఉంది.
• మన భారతదేశ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ముఖచిత్రాన్ని మార్చగలిగే శక్తి కేవలం ఒక్క గోవుకి మాత్రమే ఉంది.
• ఆవులాంటి విశిష్టతలు కలిగిన జీవి ఈ భూగోళం మీదనే ఇంకొకటి లేదు
• వెలకట్టలేని ప్రయోజనాలున్న గోవుని ఒక విలువలేని జీవిగా మనం చూసే పరిస్థితి తీసుకువచ్చారు
• గోవు కేవలం ఒక ఆధ్యాత్మిక అంశంగా, ఛారిటీ యాక్టివిటీ గా మారిపోయింది. కేవలం కొద్దిమంది మత విశ్వాసంగా ఆవుని మార్చేసారు. నిజానికి గోవు యూనివర్సల్ యానిమల్. ప్రపంచానికే భారతీయ గోవు ఆధారం.
• గోవుని నేషనల్ యానిమల్ గా ప్రకటించడం వల్ల దారుణంగా కబేళాపాలవుతున్న గో జాతి రక్షించబడుతుంది
• పాడి పరిశ్రమ అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి మూల స్తంభంగా నిలబడగలిగే గోవుని కేవలం మాంసం కోసం వధించే దారుణం అరికట్ట బడుతుంది.
• గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని యుగ తులసి, గో సేన డిమాండ్ చేస్తున్నాయి.
• ఈ విషయం మీద దేశవ్యాప్త ఉద్యమానికి యుగ తులసి, గో సేన శ్రీకారం చుట్టబోతున్నాయి.
• భారత రాష్ట్రపతి దగ్గర నుండి పంచాయతీ సర్పంచ్ వరకూ అందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తాం. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ ఉద్యమంలో గొంతు కలుపుతారు.
• గోవు మళ్ళీ తలెత్తుకుని తిరిగే రోజులు తీసుకురావడమే యుగ తులసి, గో సేనల లక్ష్యం